ఇండియాలో మొదటిసారి హెచ్ఎంపివి HMPV (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) కేసు బెంగుళూరులో 8 నెలల చిన్నారిలో నమోదు అయింది. ప్రయాణ చరిత్ర(Travel History )లేకుండా ఈ కేసు బయటపడింది.
హెచ్ఎంపివి ఒక శ్వాసకోశ వైరస్, ఇది సాధారణ జలుబు లక్షణాల నుంచి బ్రోంకైటిస్ మరియు న్యూమోనియా వరకు ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయస్సు పైబడినవారు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీని ప్రభావానికి గురవుతారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన అవసరం లేదని తెలిపింది. హెచ్ఎంపివి పరీక్షించగల లాబొరేటరీల సంఖ్యను పెంచడం కోసం చర్యలు తీసుకుంటోంది. ఇన్ఫెక్షన్ ట్రెండ్లను గమనించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) సంవత్సరం పొడవునా నిఘా ఉంచమని ఆదేశించారు.
అనుమానాస్పద లక్షణాలు గమనించినప్పుడు వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం.
Comments